https://oktelugu.com/

Job Vacancies: నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.50,000 వేతనంతో ఉద్యోగ ఖాళీలు?

Job Vacancies: ప్రసార భారతి సెక్రటేరియట్ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. న్యూస్ రీడర్, ట్రాన్స్ లేటర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2022 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 50,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. 40 సంవత్సరాల లోపు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 3, 2022 / 08:13 AM IST
    Follow us on

    Job Vacancies: ప్రసార భారతి సెక్రటేరియట్ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. న్యూస్ రీడర్, ట్రాన్స్ లేటర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2022 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 50,000 రూపాయల వరకు వేతనం లభించనుంది.

    Job Vacancies

    40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా న్యూస్ రీడర్, ట్రాన్స్‌లేటర్ (ఎన్‌ఆర్‌టి) ఉర్దూఉద్యోగ ఖాళీలలో 5 ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయని తెలుస్తోంది. అర్హత, ఆసక్తి, అనుభవం ఉన్న ఉద్యోగులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. కనీసం మూడేళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

    Also Read: కేసీఆర్ కు అంత సీనుందా? బీజేపీని ఎదుర్కోగ‌ల స‌త్తా ఉందా?

    గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ, జర్నలిజం చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అవుతారు. డిజిటల్ మాధ్యమాలు, రేడియో కొరకు అద్భుతంగా స్క్రిప్ట్ ను రాసేవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని చెప్పవచ్చు. https://applications.prasarbharati.org/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని గుర్తుంచుకోవాలి.

    hrcpbs@prasarbharati.gov.in ఈమెయిల్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా అనుభవం ఉన్న ఉద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.

    Also Read: రాజ్యాంగాన్ని తిరగరాయాలన్న బీజేపీ ప్లాన్ లో కేసీఆర్ భాగమా?