https://oktelugu.com/

నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలు..?

పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 111 ఉద్యోగాల భర్తీ కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. వేర్వేరు సర్కిల్స్ లో ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల కాగా చివరి తేదీలు సర్కిళ్లవారీగా వేర్వేరుగా ఉండటం గమనార్హం. https://www.pnbindia.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ నోటిఫికేషన్ ద్వారా ప్యూన్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 18, 2021 / 08:41 PM IST
    Follow us on

    పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 111 ఉద్యోగాల భర్తీ కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. వేర్వేరు సర్కిల్స్ లో ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల కాగా చివరి తేదీలు సర్కిళ్లవారీగా వేర్వేరుగా ఉండటం గమనార్హం. https://www.pnbindia.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ నోటిఫికేషన్ ద్వారా ప్యూన్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఐటీఐ అర్హతతో నావీలో ఉద్యోగాలు..?

    మొత్తం 111 ఖాళీలలో చెన్నై సౌత్ సర్కిల్ లో 20 ఖాళీలు ఉండగా బాలాసోర్ సర్కిల్ లో 19 ఖాళీలు, బెంగళూరు వెస్ట్ సర్కిల్ లో 18 ఖాళీలు, బెంగళూరు ఈస్ట్ సర్కిల్ లో 25 ఉద్యోగ ఖాళీలు, సూరత్ సర్కిల్ లో 10 ఉద్యోగ ఖాళీలు, హర్యానా సర్కిల్ లో 19 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. చెన్నై సౌత్ సర్కిల్ కు, హర్యానా సర్కిల్ కు ఫిబ్రవరి 22, 2021 చివరి తేదీగా ఉండగా బాలాసోర్ సర్కిల్, సూరత్ సర్కిల్, బెంగళూరు ఈస్ట్ సర్కిల్ కు మార్చి 1, 2021 చివరి తేదీగా ఉంది.

    Also Read: నిరుద్యోగులకు కాగ్నిజెంట్ శుభవార్త.. భారీగా ఉద్యోగావకాశాలు..?

    బెంగళూరు వెస్ట్ సర్కిల్ కు మాత్రం మార్చి 27, 2021 చివరితేదీగా ఉంది. ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో దరఖాస్తు ఫామ్ తీసుకొని నోటిఫికేషన్ లో పేర్కొన్న అడ్రస్ కు దరఖాస్తును పంపాలి.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    నోటిఫికేషన్ లో సర్కిళ్లను బట్టి దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్‌లలో మార్పులు ఉంటాయి. https://www.pnbindia.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.