Free laptop: దేశంలో రోజురోజుకు ల్యాప్ టాప్ లను వాడే వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. టెక్నాలజీ వినియోగం పెరగడంతో ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లే అవకాశం ఉండటంతో ఎక్కువమంది ల్యాప్ టాప్ లను వినియోగించడానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందించే విధంగా కొన్ని పథకాలను అమలు చేస్తున్నాయి,
అయితే కేంద్ర ప్రభుత్వం దేశంలోని విద్యార్థులందరికీ ఫ్రీగా ల్యాప్ టాప్స్ అందించనుందని సోషల్ మీడియా లో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. వెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకుంటే ఉచితంగా ల్యాప్ టాప్ ను కచ్చితంగా పొందవచ్చని ఆ మెసేజ్ లో చెప్పుకొచ్చారు. అయితే వైరల్ అవుతున్న ఈ మెసేజ్ లో ఎలాంటి నిజం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించి స్పష్టతనిచ్చింది. ఇలాంటి ఫేక్ మెసేజ్ లను నమ్మవద్దని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది.
Also Read: Ram Gopal Varma: మళ్లీ కెలికాడు.. ఈ కెలుకుడు ఇంకెన్నాళ్లు ?
సోషల్ మీడియా వినియోగం ఊహించని స్థాయిలో పెరగగా అదే సమయంలో ఫేక్ వార్తలు సైతం ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. ఇలాంటి మోసపూరిత మెసేజ్ ల విషయంలో అప్రమత్తంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. ఫోన్ నంబర్ ను రిజిష్టర్ చేసుకోవడం ద్వారా ఉచితంగా ల్యాప్ టాప్ లను పొందే అవకాశం అయితే ఉంటుందని ఫేక్ వార్త ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.
ఇలాంటి ఫేక్ లింక్ లను క్లిక్ చేయడం ద్వారా మోసపోయే అవకాశంతో పాటు మన ఫోన్, బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన సమాచారం కూడా ఇతరులకు తెలిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎవరైనా స్నేహితులు ఈ తరహా మెసేజ్ లను పంపితే ఆ మెసేజ్ ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తే మంచిదని చెప్పవచ్చు.
Also Read: Prashant kishor: కాంగ్రెస్ కు ‘హ్యాండ్’ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్.. గట్టి షాక్