Homeఎడ్యుకేషన్IT Jobs with Inter: ఇంటర్ అర్హతతో ఐటీ జాబ్ పొందే అవకాశం.. ఎలా అంటే..?

IT Jobs with Inter: ఇంటర్ అర్హతతో ఐటీ జాబ్ పొందే అవకాశం.. ఎలా అంటే..?

సాధారణంగా ఐటీ రంగంలో ఉద్యోగం సాధించాలంటే ఇంజనీరింగ్, డిగ్రీ లేదా పీజీ చదివి ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది. అయితే ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఒకటైన హెచ్‌సిఎల్ మాత్రం ఇంటర్ అర్హతతోనే ఐటీ ఉద్యోగం పొందే అవకాశం కల్పించింది. ఈ సంస్థ టెక్ బీ ప్రోగ్రామ్ పేరుతో ఇంటర్ విద్యార్థులకు కూడా అవకాశాన్ని కల్పిస్తుండటం గమనార్హం. టెక్ బీ ప్రోగ్రామ్ ద్వారా ఇంటర్ పాసైన విద్యార్థులు సంవత్సరం పాటు శిక్షణ పొందాలి.

ఇంటర్ లో మ్యాథమాటిక్స్ ఒక సబ్జెక్ట్ గా చదువుకున్న వాళ్లు మాత్రమే టెక్ బీ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతేడాది, ఈ ఏడాది ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హెచ్‌సిఎల్ టెక్ బీ ప్రోగ్రామ్ కు ఎంపికైన విద్యార్థులకు విద్యార్థులు వాళ్ల తల్లిదండ్రులపై ఆధారపడకుండా కావాల్సిన ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడలలో ఇందుకు సంబంధించిన శిక్షణా కేంద్రాలు ఉన్నాయి.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు ఇంటర్న్ షిప్ సమయంలో 10,000 రూపాయలు స్టైఫండ్ గా పొందే అవకాశం ఉంటుంది. శిక్షణ పూర్తైన తర్వాత హెచ్‌సిఎల్ లో పూర్తిస్థాయి ఉద్యోగులుగా చేరడం ద్వారా 2,20,000 రూపాయల వరకు వేతనంగా పొందవచ్చు. హెచ్‌సిఎల్ లో పని చేస్తూ ఇతర యూనివర్సిటీలలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కూడా ఉంటుంది.

ఈ ప్రోగ్రామ్ కు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా ఆన్ లైన్ లో శిక్షణ కోసం అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version