CMAT 2025 Notifications : విద్యార్థులకు గుడ్ న్యూస్. ప్రతిష్టాత్మకమైన మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలో అభ్యసించడానికి ప్రవేశాల కోసం సీమ్యాట్ 2025 నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ సీ మ్యాట్ ప్రవేశ పరీక్షకు అప్లై చేయడానికి నవంబర్ 14 నుంచి డిసెంబర్ 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. దేశంలో ఐఐఎంలతో పాటు ప్రతిష్టాత్మక మేనేజ్‌మెంట్ విద్యా సంస్థలు, ఏఐసిటిఇ గుర్తింపు పొందిన యూనివర్శిటీలు, వీటికి అనుబంధం ఉన్న విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం సీమ్యాట్ స్కోర్ అనేది తప్పనిసరి. ఈ సీమ్యాట్ స్కోర్ బట్టి విద్యా సంస్థల్లో జాయిన్ కావడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ సీమ్యాట్ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ ప్రవేశానికి పరీక్షను కంప్యూటర్ బేస్డ్ ద్వారా నిర్వహిస్తారు.
సీమ్యాట్ కంప్యూటర్ బేస్డ్ పరీక్షలో క్వాంటియేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్ వంటి సబ్జెట్‌లు ఉంటాయి. 2025-26 విద్యా సంవత్సరానికి మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాల పొందడం కోసం ఈ సీ మ్యాట్ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ సీమ్యాట్‌లో వచ్చిన స్కోర్ ఆధారంగా ఆయా విద్యా సంస్థల్లో అవకాశ కలుగుతుంది. మీకు సీమ్యాట్‌లో వచ్చిన స్కోర్ బట్టి వివిధ విద్యా సంస్థల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షకు కటాఫ్ స్కోర్ ఉంటుంది. అన్ని మార్కులు వస్తే మీరు అనుకున్న విద్యా సంస్థలో చదవడానికి ప్రవేశం లభిస్తుంది. అయితే కేవలం కంప్యూటర్ బేస్డ్ పరీక్ష తర్వాత ప్రవేశం కల్పించరు. అర్హతలను బట్టి ఎంపిక చేసి గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలలో పాస్ అయిన వారికి ద్వారా ప్రముఖ విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఈ సీమ్యాట్ పరీక్షకు కేవలం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 13వ తేదీ రాత్రి 9.50 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము అయితే డిసెంబర్ 14వ తేదీ రాత్రి 11.50 వరకు చెల్లించి, డిసెంబర్ 15 నుంచి 17వరకు దరఖాస్తులను సరిచేసుకోవచ్చు. ఈ సీమ్యాట్ పరీక్ష 2025 జనవరి 25న నిర్వహిస్తారు. హాల్ టికెట్లను జనవరి 17వ తేదీన రిలీజ్ చేస్తారు. మొత్తం మూడు గంటల పాటు జరిగే ఈ మ్యాట్ పరీక్ష పేపర్ కేవలం ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. ఈ లింక్ ఒపెన్ చేసి https://exams.nta.ac.in/CMAT/ దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా 011 40759000, 69227700 నంబర్లను సంప్రదించవచ్చు లేదా దీనికి cmat@nta.ac.inకు మెయిల్ చేయవచ్చు.