Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2 సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపధ్యం లో ఈ సినిమా మీద చాలామంది చాలా రకాల అంచనాలను పెట్టుకున్నారు. మరి వల అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక పుష్ప మొదటి పార్ట్ తెలుగులో పెద్దగా ఆడలేదు. బాలీవుడ్ లో మాత్రమే మంచి సక్సెస్ ని సాధించింది. అయినప్పటికి పుష్ప 2 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ టీం తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తే కనక పాన్ ఇండియా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ టాప్ హీరోగా ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక దానికి అనుగుణంగానే ఆయన చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క నటుడు మంచి విజయాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
అయితే అల్లు అర్జున్ మాత్రం పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్ ని సాధించి దాదాపు 1500 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమా మొదటిరోజు భారీ కలెక్షన్స్ ని సాధిస్తుంది అంటూ ఇప్పటి నుంచే భారీ రేంజ్ లో పబ్లిసిటీ అయితే చేస్తున్నారు.
నిజానికి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మొదటి రోజు భారీ కలెక్షన్లు సాధించిన సినిమాల్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా 250 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేస్తూ పుష్ప 2 300 కోట్ల కలెక్షన్స్ రాబడుతుందంటూ ఇప్పటినుంచే అంచనాలైతే వేస్తున్నారు. మరి దానికి అనుగుణంగానే అలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా?
లాంగ్ రన్ లో ఇచ్చిన 1500 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకుంటే అల్లు అర్జున్ క్రేజ్ తారా స్థాయిలోకి వెళ్ళిపోతుంది. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా కూడా తను ఎదుగుతాడని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…