https://oktelugu.com/

ONGC Recruitment 2021:  ఓఎన్‌జీసీలో 21 ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్.. అర్హులు ఎవరంటే?

ONGC Recruitment 2021: ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ నిరుద్యోగులకు మరోసారి తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటీవ్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. పర్సనల్ మేనేజ్మెంట్/హెఆర్డీ/హెచ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 28, 2021 / 04:39 PM IST
    Follow us on

    ONGC Recruitment 2021: ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ నిరుద్యోగులకు మరోసారి తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటీవ్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

    ONGC Recruitment 2021

    పర్సనల్ మేనేజ్మెంట్/హెఆర్డీ/హెచ్ ఆర్ ఏమ్, ఎంబీఏ విభాగాలలో 60 శాతం మార్కులతో పాసైన వాళ్లు హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటీవ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. పబ్లిక్ రిలేషన్స్/జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో పీజీ పూర్తి చేసిన వాళ్లు పబ్లిక్‌ రిలేషన్స్‌ పోస్టులకు అర్హులుగా ఉంటారు. యూజీసీ నెట్ 2020లో అర్హత సాధించిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి.

    Also Read: Jobs: జూట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో జాబ్స్.. నెలకు రూ.లక్షకు పైగా వేతనంతో?

    ఆన్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 300 రూపాయలుగా ఉంది. ఓబీసీ, ఈ.డబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. https://www.ongcindia.com/wps/wcm/connect/en/home వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభిస్తుంది. నిరుద్యోగులు వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

    Also Read: Jobs: ప్రముఖ సంస్థ విప్రోలో ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?