Pushpa Movie Collections: ‘పుష్ప’ కలెక్షన్స్ పై చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు ఈ సినిమాకు నిజంగానే కలెక్షన్లు వస్తున్నాయా ? లేక, మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లో వందల కోట్లు అంటూ పోస్టర్స్ డిజైన్ చేసి సోషల్ మీడియాలోకి వదులుతున్నారా ? ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. సహజంగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన సినిమాల విషయంలో కలెక్షన్స్ ఎప్పుడు క్లారిటీగా ఉండవు.
వాళ్ళు నిర్మించే ప్రతి సినిమా విషయంలో ఇలాగే అనవసరపు ఆర్భాటాలకు పోతారు. ఇప్పుడు కూడా మా ‘పుష్ప’ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 225 కోట్ల రూపాయల వసూళ్లు చేసింది, ఇంకా వందల కోట్లు కలెక్ట్ చేసేలా ఉంది అంటూ మొన్నే నిర్మాతలు చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా పుష్ప ఇప్పటివరకు 275 కోట్లు కలెక్ట్ చేసిందని ఈ రోజు థాంక్స్ మీట్ లో అధికారికంగా ప్రకటించారు నిర్మాత నవీన్ యెర్నేని.
మరి నవీన్ యెర్నేని చెప్పినట్టు పుష్ప నిజంగానే 225 కోట్ల రూపాయల వసూళ్లు చేసిందా ? పైగా నవీన్ యెర్నేని మాటల ప్రకారం పుష్ప సినిమాకు మరో 50 నుంచి 75 కోట్ల రూపాయలు వస్తాయట. ఏమిటి నిజమే ? మొత్తానికి నవీన్ యెర్నేని అయితే బాగా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కానీ ఆ ధీమాలో వాస్తవం ఎంత అనేదే ఇప్పుడు మిలియన్ల డాలర్ల ప్రశ్న.
Also Read: ‘పుష్ప’ 5 రోజుల బాక్సాఫీస్ ఫుల్ కలెక్షన్స్ ఇవే !
ఇంతకీ నవీన్ యెర్నేని ఏమి మాట్లాడాడు అంటే.. ఆయన మాటల్లోనే.. “2021వ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ‘పుష్ప’ మాత్రమే. మా పుష్ప సినిమా జనవరి 6 వరకు థియేటర్లలో కలెక్షన్స్ రాబడుతూనే ఉంటుంది. ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ అవుతుంది. అంటే ఆర్ఆర్ఆర్ వచ్చే వరకు పుష్పకు ఇక తిరుగు లేదు అంటూ నవీన్ యెర్నేని చెప్పుకొచ్చాడు.
పైగా ఈ మధ్యలో పుష్ప మరో 325 నుంచి 340 కోట్ల మార్క్ ను కూడా అందుకుంటుందని సగర్వంగా చెప్పాడు. మరి నవీన్ మాటలను ఎంతవరకు సీరియస్ గా తీసుకోవాలి ? నిజానికి పుష్ప థియేటర్స్ లో జనం లేరు. ఫస్ట్ వీక్ లోనే సగం థియేటర్స్ పడిపోయాయి. కానీ నిర్మాతలు మాత్రం అఖండ విజయం, 300 కోట్లు కలెక్షన్స్ అంటూ హడావుడి చేస్తున్నారు.
Also Read: పుష్పలో ఆ సీన్‌ను సుకుమార్ నగ్నంగా చూపించాలనుకున్నాడట!