AP Govt Jobs: ఏపీలో 1317 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్.. మంచి జీతంతో?

AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 1317 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా పారా మెడికల్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నవంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. డిసెంబర్ 17వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ […]

Written By: Kusuma Aggunna, Updated On : December 4, 2021 12:45 pm
Follow us on

AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 1317 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా పారా మెడికల్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నవంబర్ 21వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. డిసెంబర్ 17వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ను ప్రకటించడం జరుగుతుంది.

AP Govt Jobs

అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. భర్తీ చేయనున్న ఉద్యోగ ఖాళీలలో గ్రేడ్‌-2 ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉద్యోగ ఖాళీలు 149, గ్రేడ్‌-2 ఫార్మాసిస్ట్‌ ఉద్యోగ ఖాళీలు 17, ఎఫ్‌ఎన్‌ఓ ఉద్యోగ ఖాళీలు 839, శానిటరీ అటెండర్‌, వాచ్‌మెన్‌ పోస్టులు 312 ఉన్నాయి. ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మాసిస్ట్‌ ఉద్యోగాలను మాత్రం కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.

Also Read: కడప డీసీసీబీలో 75 ఉద్యోగ ఖాళీలు.. మంచి జీతంతో?

డిసెంబర్ నెల 23వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన తుది మెరిట్ లిస్ట్ ను ప్రకటిస్తారు. పీహెచ్‌సీల్లో 264 వైద్యుల ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం రాష్ట్రస్థాయిలో నోటిఫికేషన్ జారీ కానుందని సమాచారం. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీగా వేతనం లభించనుందని తెలుస్తోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే ప్రయోజనం చేకూరుతుంది.

Also Read: ఎన్‌బీసీసీలో 70 ఉద్యోగ ఖాళీలు.. నెలకు లక్షన్నరకు పైగా వేతనంతో?