Rashmika Mandanna: రష్మిక మందన్నా గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఛలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దగుమ్మ… వరుస విజయాలు అందుకుంటూ నేషనల్ క్రష్ గా మారింది. ప్రస్తుతం ఈమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి పుష్ప సినిమాలో నటిస్తుంది. క్రియేటర్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తుండగా… ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను పుష్ప ది రైజ్ అనే మొదటి భాగాన్ని డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది చిత్రయూనిట్.

Also Read: హైదరాబాద్కు దీపికా.. ప్రభాస్ సినిమా షూటింగ్ కోసమేనట?
వరుస అప్డేట్ లతో సినిమాపై అంచనాలను పెంచుతుంది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో బన్నీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది రష్మిక. మూవీ త్వరలో విడుదల కాబోతుంది కదా సర్… స్పెషల్గా ఏదైనా పంపించాలనిపించింది. అందుకే సర్ప్రైజ్ గిఫ్ట్ మీకోసం అంటూ కొన్ని వస్తువులను బాక్స్ లో పెట్టి పంపించింది. వాటితో పాటు ఒక నోట్ ను ఇవ్వడం విశేషం. దీనికి గాను అల్లు అర్జున్ తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ రష్మికకు ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తుండగా.. అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్నా నటిస్తోంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. విలన్ గా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటిస్తుండగా… అనసూయ, సునీల్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామీ సామీ పాటలు ప్రేక్షకులను విపరీతంగా కట్టుకున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్, ముత్తమ్ శెట్టి మీడియా బ్యానర్లపై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read: అలా ఉండేవాడ్నే పెళ్లిచేసుకుంటానంటున్న సారా