Jobs: హైదరాబాద్ లోని నైపర్ లో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో? 

Jobs: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాసూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ సిద్ధమైంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థ మొత్తం 20 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధం కాగా అసిస్టెంట్‌ గ్రేడ్‌ ఆఫీసర్‌, అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలతో పాటు సైంటిస్ట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, స్టోర్‌కీపర్‌ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మాస్టర్స్‌ డిగ్రీ, […]

Written By: Kusuma Aggunna, Updated On : January 30, 2022 8:33 pm
Follow us on

Jobs: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాసూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ సిద్ధమైంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థ మొత్తం 20 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధం కాగా అసిస్టెంట్‌ గ్రేడ్‌ ఆఫీసర్‌, అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలతో పాటు సైంటిస్ట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, స్టోర్‌కీపర్‌ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

మాస్టర్స్‌ డిగ్రీ, ఎం ఫార్మసీ, ఎంఎస్సీ, బీకామ్, బ్యాచిలర్ డిగ్రీ, ఇంటర్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. 27 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉండనుంది.

స్కిల్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది . 2022 సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా 2022 సంవత్సరం మార్చి 3వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని తెలుస్తోంది. http://www.niperhyd.ac.in/careers_of_niper_hyderabad.html వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉండటంతో నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని తెలుస్తోంది.