https://oktelugu.com/

NIMS Hyderabad Recruitment: నిమ్స్ హైదరాబాద్ లో ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.లక్షన్నర వేతనంతో?

NIMS Hyderabad Recruitment: నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ టీచింగ్ లో అనుభవం ఉన్నవాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మెడికల్‌ అంకాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, అర్థోపెడిక్స్‌, ఎండోక్రైనాలజీ, జనరల్‌ మెడిసిన్‌, హెమటాలజీ, మైక్రోబయాలజీ, మెడికల్‌ జెనెటిక్స్‌, అనెస్తీషియాలజీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌ సర్జరీ విభాగాలలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. https://www.nims.edu.in/ వెబ్ సైట్ ద్వారా ఈ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 11, 2022 5:52 pm
    Follow us on

    NIMS Hyderabad Recruitment: నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ టీచింగ్ లో అనుభవం ఉన్నవాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మెడికల్‌ అంకాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, అర్థోపెడిక్స్‌, ఎండోక్రైనాలజీ, జనరల్‌ మెడిసిన్‌, హెమటాలజీ, మైక్రోబయాలజీ, మెడికల్‌ జెనెటిక్స్‌, అనెస్తీషియాలజీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌ సర్జరీ విభాగాలలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.

    NIMS Hyderabad Recruitment

    NIMS Hyderabad Recruitment

    https://www.nims.edu.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మెడికల్‌ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎం/ ఎంసీహెచ్‌/డీఎన్‌బీ) పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎగ్జిక్యూటివ్‌ రిజిస్ట్రార్‌, నిమ్స్‌, పంజాగుట్ట, హైదరాబాద్‌ 500082 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి.

    Also Read: అలిగిన ‘మంచు’ ఫ్యామిలీని జగన్ ఓదార్చారా?

    ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు 1,68,900 రూపాయలు వేతనంగా లభించనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. మెడికల్‌ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎం/ ఎంసీహెచ్‌/డీఎన్‌బీ) పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

    భారీ వేతనం లభిస్తున్న నేపథ్యంలో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులతో పాటు అన్ని అర్హతలు ఉన్నవాళ్లకు భారీస్థాయిలో ప్రయోజనం చేకూరుతోంది.

    Also Read: చిక్కుల్లో మంత్రి అప్ప‌ల‌రాజు.. పోలీసు అధికారిపై దుర్భ‌ష‌లాడ‌టంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు..!