NILD Recruitment 2022: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజేబిలిటీస్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ సంస్థ సిద్ధమైంది. మొత్తం 13 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. ఈ ఉద్యోగ ఖాళీలలో త్రిపురలో 5 ఉద్యోగ ఖాళీలు, పాట్నాలో 4 ఉద్యోగ ఖాళీలు, డెహ్రాడూన్ లో 2 ఉద్యోగ ఖాళీలు, ఐజ్వాల్ లో 2 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
క్లినికల్ అసిస్టెంట్, క్లినికల్ సైకాలజిస్ట్, ఓరియెంటేషన్ అండ్ మొబిలిటీ ఇన్‌స్ట్రక్టర్, లెక్చరర్ ఉద్యోగ ఖాళీలతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్, డైరెక్టర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. వేర్వేరు విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
Also Read: జాతీయ రాజకీయాలపై ‘కేసీఆర్’ అసలు ప్లాన్ ఇదే!
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 25,000 రూపాయల నుంచి 80,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. 2022 సంవత్సరం మార్చి 11వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. http://www.niohkol.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటార్ డిజెబిలిటీస్, బి.టి.రోడ్, బాన్ హుగ్లీ, కోల్‌కతా పిన్ : 700090 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ విధానంలో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: సంజయ్ రెండో విడత పాదయాత్ర ఆ రోజునుంచే.. చాలా పెద్ద ప్లాన్ వేశాడుగా