NHM Recruitment 2021: నేషనల్ హెల్త్ మిషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు జిల్లాల డీఎంహెచ్‌ఓల ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు విభాగాల్లో 858 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
మొత్తం 858 ఉద్యోగ ఖాళీలలో స్పెషలిస్ట్ ఉద్యోగ ఖాళీలు 53, మెడికల్ ఆఫీసర్ల ఉద్యోగ ఖాళీలు 308, స్టాఫ్ నర్సుల ఉద్యోగ ఖాళీలు 324, ల్యాబ్‌టెక్నీషియన్ల ఉద్యోగ ఖాళీలు 14, పారామెడికల్‌స్టాఫ్ ఉద్యోగ ఖాళీలు 90, కన్సల్టెంట్ ఉద్యోగ ఖాళీలు 13, సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలు 56 ఉన్నాయి. పదో తరగతి, జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్), డీఎంఎల్/టీఎంఎల్‌టీ/బీఎస్సీ(ఎంఎల్‌టీ), బ్యాచిలర్స్‌డిగ్రీ, ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ(సోషల్‌వర్క్), ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 వరకు వేతనంగా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2021 సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://visakhapatnam.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.