NFSU Recruitment 2021: నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌సీయూ) నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. గుజరాత్, గాంధీనగర్ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థ కావడం గమనార్హం. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

మొత్తం 101 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. త్రిపుర, గోవా, ఢిల్లీ, గాంధీనగర్ క్యాంపస్ లలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. సంబంధిత సబ్జెక్టులలో పీ.హెచ్.డీ పాస్ కావడంతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్వ్యూలలో ప్రతిభ, ప్రజంటేషన్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు 90,000 రూపాయల వరకు వేతనంగా లభిస్తుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 250 రూపాయలు ఫీజుగా ఉంది. మిగిలిన అభ్యర్థులు మాత్రం 500 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించటానికి అక్టోబర్ 20వ తేదీ చివరితేదీగా ఉండగా దరఖాస్తుల హార్డ్ కాపీలను పంపడానికి అక్టోబర్ 25వ తేదీ చివరితేదీగా ఉంది. సంబంధిత సబ్జెక్ట్ లో పీ.హెచ్.డీ, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.