పది అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. మంచి జీతంతో..?

మధ్యప్రదేశ్ కు చెందిన నార్నర్న్‌ కోల్‌ ఫీల్డ్స్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. గతంలో పలు జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేసిన ఈ సంస్థ వివిధ ట్రేడుల్లో 1500 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఎనిమిది, పది, ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం […]

Written By: Navya, Updated On : July 4, 2021 4:01 pm
Follow us on

మధ్యప్రదేశ్ కు చెందిన నార్నర్న్‌ కోల్‌ ఫీల్డ్స్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. గతంలో పలు జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేసిన ఈ సంస్థ వివిధ ట్రేడుల్లో 1500 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఎనిమిది, పది, ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. మొత్తం 1500 ఉద్యోగ ఖాళీలు ఉండగా అందులో వెల్డర్‌ (గ్యాస్‌, ఎలక్ట్రిక్‌)- 100, ఫిట్టర్‌- 800, ఎలక్ట్రీషియన్‌- 500, మోటార్‌ మెకానిక్‌- 100 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగ ఖాళీని బట్టి సంబంధిత ట్రేడ్ లో అర్హత ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 16 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2021 సంవత్సరం జులై 9వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు చివరి తేదీగా ఉంది. http://nclcil.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సంధేహాలను నివృత్తి చేసుకునే అవకాశాలు ఉంటాయి.

నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా వరుసగా రిలీజవుతున్న నోటిఫికేషన్లపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎక్కువగా నోటిఫికేషన్లు రిలీజవుతుండటం గమనార్హం.