Site icon OkTelugu

అలా చేస్తే వాళ్లని అవమానించినట్లే.. కపిల్ దేవ్

ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న టీమ్ ఇండియా జట్టులో కొత్తగా ఎవరినీ చేర్చొద్దని, అక్కడున్న 20 మంది ఆటగాళ్లు సరిపోతారని దిగ్గజ సారథి కపిల్ దేవ్ అన్నారు. ఇటీవల యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ గాయపడటంతో ఆ స్థానంలో పృథ్వీషాను తిరిగి ఇంగ్లాండ్ కు పంపించాలని భారత జట్టు బీసీసీఐని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన కపిల్ అలా చేయడం సరైంది కాదన్నారు. అదే జరిగితే ఇంగ్లాండ్ లో ఉన్న అదనపు ఆటగాళ్లను అవమానించినట్లేనని అభిప్రాయపడ్డారు.

Exit mobile version