NCERT Recruitment 2025
NCERT Recruitment 2025 : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) మీడియా రంగంలో కెరీర్‌ను సృష్టించాలనుకునే అభ్యర్థులకు గొప్ప అవకాశాన్ని కల్పించింది. NCERT యాంకర్, వీడియో ఎడిటర్ మరియు కెమెరా పర్సన్‌తో సహా అనేక పోస్టులకు నియామకాలను ప్రకటించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.ncert.nic.in ని సందర్శించడం ద్వారా నియామకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.
Also Read : 133 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తు విధానం.. గడువు వివరాలు ఇవీ!
రాత పరీక్ష లేదు..
NCERT విడుదల చేసిన సమాచారం ప్రకారం, ఈ పోస్టులకు రాత పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను నేరుగా ఎంపిక చేస్తారు. వివిధ పోస్టులకు ఇంటర్వ్యూలు మార్చి 17, 22వ తేదీల మధ్య నిర్వహిస్తారు. యాంకర్ (హిందీ, ఇంగ్లీష్) ఉద్యోగానికి ఇంటర్వ్యూ మార్చి 17, 2025న, ప్రొడక్షన్ అసిస్టెంట్ (వీడియో మరియు ఆడియో) ఉద్యోగానికి ఇంటర్వ్యూ మార్చి 18న, వీడియో ఎడిటర్ మార్చి 19న, సౌండ్ రికార్డిస్ట్ మార్చి 20న, కెమెరా పర్సన్ మార్చి 215న,గ్రాఫిక్ అసిస్టెంట్/ఆర్టిస్ట్ ఉద్యోగానికి మార్చి 22న షెడ్యూల్ చేయబడింది.
అర్హతలు..
యాంకర్ (హిందీ మరియు ఇంగ్లీష్) – ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ తప్పనిసరి. హిందీ, ఇంగ్లీష్ భాషపై మంచి పట్టు ఉండాలి. ఇంటర్వ్యూ తీసుకునే నైపుణ్యాలు అవసరం. ద్విభాషా అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
ప్రొడక్షన్ అసిస్టెంట్ – మీడియా (ఆడియో/రేడియో ప్రొడక్షన్)లో డిప్లొమాతో గ్రాడ్యుయేషన్ తప్పనిసరి. రెండేళ్ల అనుభవం అవసరం. NUENDO లేదా ఇతర ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం ఉండాలి.
గ్రాఫిక్ అసిస్టెంట్/ఆర్టిస్ట్ – ఫైన్ ఆర్ట్‌లో గ్రాడ్యుయేషన్ లేదా గ్రాఫిక్స్ మరియు యానిమేషన్‌లో డిప్లొమా అవసరం. సంబంధిత రంగంలో కనీసం రెండేళ్ల అనుభవం అవసరం.
ఇంటర్వ్యూకు హాజరు కావడానికి, అభ్యర్థులు ఉదయం 9 గంటలకు CIET, NCERT, న్యూఢిల్లీకి చేరుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60 వేల జీతం లభిస్తుంది.
Also Read : ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా మూడు రోజులే గడువు..