
నిరుద్యోగులకు నేషనల్ ఏర్పోస్పేస్ లాబొరేటరీస్ శుభవార్త చెప్పింది. 43 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నేషనల్ ఏర్పోస్పేస్ లాబొరేటరీస్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
https://nal.res.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 43 ఉద్యోగ ఖాళీలు ఉండగా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 19, టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలు 17, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 6, టెక్నికల్ ఆఫీసర్ 1, ఫిట్టర్ 6, మెషినిస్ట్ 3, డ్రాట్స్‌మెన్ 2, టర్నర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, ఎలక్ట్రోప్లాటర్, షీట్ మెటల్ వర్కర్ ఉద్యోగ ఖాళీలు 1 చొప్పున ఉన్నాయి.
మెకానికల్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ ఇంజినీరింగ్ పాసైన వాళ్లు టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఇతర ఉద్యోగాలకు ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటల్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్ మెటల్లర్జీలో డిప్లొమా లేదా బీఎస్సీ కంప్యూటర్స్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, బీసీఏ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబందించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.