Ministry of Defence Recruitment 2021: కేంద్ర రక్షణ శాఖ నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. సివిలియన్ కేటరింగ్ ఇన్‌స్ట్రక్టర్, లేబర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, సివిల్ మోటార్ డ్రైవర్, క్లీనర్, కుక్ ఉద్యోగ ఖాళీల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. బెంగళూరులోని ఏసీపీ సౌత్ సెంటర్ కొరకు ఈ సంస్థ దరఖాస్తులను స్వీకరిస్తూ ఉండటం గమనార్హం. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
అధికారిక నోటిఫికేషన్‌లో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ఫామ్ ఉంటుంది. మొత్తం ఉద్యోగ ఖాళీలలో సివిల్ మోటార్ డ్రైవర్ (పురుషులు ) 115 ఉద్యోగ ఖాళీలు ఉండగా లేబర్ (పురుషులు) 193 ఉద్యోగ ఖాళీలు, క్లీనర్ ఉద్యోగ ఖాళీలు 67, కుక్ ఉద్యోగ ఖాళీలు 15, సివిలియన్ కేటరింగ్ ఇన్‌స్ట్రక్టర్ ఉద్యోగ ఖాళీలు 3, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలు 7 ఉన్నాయి. కనీసం పది పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సివిల్ మోటార్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి. హెవీ, లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. మోటార్ మెకానిజం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. పురుషులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. కుక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు ఖచ్చితంగా కుకింగ్ లో అనుభవం ఉండాలి.
సివిలియన్ కేటరింగ్ ఇన్‌స్ట్రక్టర్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసేవాళ్లు కేటరింగ్‌లో డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్స్ పాస్ కావడంతో కనీసం సంవత్సరం అనుభవం ఉండాలి. ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 19,900 రూపాయల వేతనం లభిస్తుంది. సంస్థ బెంగళూరు అడ్రస్ కు ఆఫ్ లైన్ లో సెప్టెంబర్ 17వ తేదీలోగా దరఖాస్తులను పంపాలి.