
మజ్‌గావ్‌డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ముంబైలోని భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఈ సంస్థ నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. వివిధ ట్రేడుల్లో ఖాళీగా ఉన్న 425 ఉద్యోగ ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. పైప్ ఫిట్టర్, స్ట్రక్చరల్ ఫిట్టర్, వెల్డర్, కోపా, ఇతర ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా అర్హతను బట్టి ఈ ఉద్యోగ ఖాళీలకు వేతనం లభిస్తుంది.
https://mazagondock.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 425 ఉద్యోగ ఖాళీలలో వేర్వేరు ట్రేడులకు సంబంధించి ఉద్యోగ ఖాళీలు ఉండగా ఎనిమిది, పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్స్ ను బట్టి ఉద్యోగ ఖాళీలకు అర్హత వయస్సు ఉంటుందని తెలుస్తోంది.
కంప్యూటర్ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. సంబంధిత సబ్జెక్టుల నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. నాగ్‌పూర్, పుణె, ఔరంగాబాద్ లలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఆగష్టు 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
ఆగష్టు నెల చివరి వారంలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పరీక్ష జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.