https://oktelugu.com/

MBBS: ఎంబీబీఎస్‌ ఫీజు విషయంలో కీలక నిర్ణయం.. ప్రభుత్వ, మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు వర్తింపు!

నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ రాష్ట్రాల వారీగా ప్రారంభమైంది.జాతీయ స్థాయిలో ఆగస్టు 14న ఇది ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఎంబీబీఎస్‌ ఫీజులు పెరిగాయి. మన దేశంలో ఆ రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ చేయాలంటే భారీగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 12, 2024 / 12:18 PM IST

    MBBS

    Follow us on

    MBBS: ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లోని అన్ని మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు ఎంబీబీఎస్‌ కోర్సుకు ఫీజును 5 శాతం పెంచారు. గతంలో రూ.55.28 లక్షలుగా ఉన్న పూర్తి ఫీజును రూ.58.02 లక్షలు చేశారు. కాగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ప్రభుత్వ కోటాలోని ఎంబీబీఎస్‌ సీట్ల ఫీజు గతంలో రూ.21.48 లక్షలుగా ఉండగా, దానిని ఇప్పుటు రూ.22.54 లక్షలకు పెంచారు. ఈమేరకు పంజాబ్‌లోని మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ విభాగం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బాబా ఫరీద్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ నోటిఫికేషన్‌ ప్రకారం 1,550 అడ్మిషన్లు చేస్తుంది. ఈ సీట్లలో నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 750 సీట్లు, మిగిలిన 800 సీట్లు రాష్ట్రంలోని నాలుగు ప్రైవేట్‌ మరియు రెండు మైనారిటీ హోదా కలిగిన వైద్య సంస్థలలో ఉన్నాయి. నోటిఫికేషన్‌ ప్రకారం అమృత్‌సర్, పాటియాలా, ఫరీద్‌కోట్, మొహాలీలోని నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పూర్తి ఎంబీబీఎస్‌ కోర్సు ఫీజు రూ.9.05 లక్షల నుంచి 9.50 లక్షలకు పెంచారు. ప్రతీ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో ప్రభుత్వ కోటా కింద 50 శాతం సీట్లు రిజర్వ్‌ చేయబడ్డాయి. మిగిలిన 50 శాతం సీట్లలో 35 శాతం మేనేజ్‌మెంట్‌ కోటా మరియు 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా ఉన్నాయి. 1.10 లక్షల డాలర్లు ఉన్న ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల ఫీజు స్ట్రక్చర్‌లో ఎలాంటి మార్పు లేదు.

    ఆ కాలేజీలో ప్రవేశాలు లేవు..
    ఇదిలా ఉంటే 150 సీట్లు ఉన్న పఠాన్‌కోట్‌లోని చింత్‌పూర్ణి మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో లోపాలున్నాయని ఆరోపిస్తూ ఈ ఏడాది విద్యార్థులను అడ్మిషన్‌ చేయకుండా నిషేధించారు. ఇంతకుముందు కూడా, ఈ కళాశాలలో రెండు విద్యా సంవత్సరాల్లో (2017–18 మరియు 2018–19) ప్రవేశాలు లేవు. పంజాబ్లో ఇప్పటికే నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది.

    భారీగా చెల్లించాలి..
    మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. పంజాబ్‌లోని మెడకల్‌ కాలేజీల్లో ప్రవేశం పొందే విద్యార్థులు అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో మేనేజ్మెంట్, ఎన్నారై కోటా సీట్ల భర్తీకి రాష్ట్రాల వారీగా మెడికల్‌ కౌన్సెలింగ్‌ మొదలైంది. జాతీయస్థాయిలో నీట్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌ ఆగస్టు 14న ప్రారంభమవుతుందని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తెలిపింది. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను కళాశాలలు భర్తీ చేసుకుంటున్నాయి.