
ఇండియన్ కోస్ట్ గార్డు నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ 02/2022 బ్యాచ్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 350 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2021, జులై 2 నుంచి ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. 2021, జులై 16 ఈ ఉద్యోగ ఖాళీల దరఖాస్తుకు చివరితేదీగా ఉంది. https://joinindiancoastguard.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
మొత్తం 350 ఉద్యోగ ఖాళీలలో నావిక్ (జనరల్ డ్యూటీ) 260, నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) 50, యాంత్రిక్ (మెకానికల్) 20, యాంత్రిక్ (ఎలక్ట్రికల్) 13, యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్) 7 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్ లలో పాస్ కావడంతో పాటు 22 సంవత్సరాల లోపు వయస్సు ఉండి 01 ఫిబ్రవరి 2000 – 31 జనవరి 2004 మధ్య జన్మించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టులకు పదో తరగతి పాస్ కావడంతో పాటు 22 ఏళ్ల లోపు వయస్సు ఉండి 01 ఏప్రిల్ 2000 – 31 మార్చి 2004 మధ్య జన్మించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుండి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీర్ లో డిప్లొమా ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలు కాగా ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.