https://oktelugu.com/

Jobs: వచ్చే 20 ఏళ్లలో ఎక్కువ జీతం ఇచ్చే.. టాప్ జాబ్స్ ఇవే!

ఏఐ వల్ల ఇప్పటికే కొన్ని ఉద్యోగాలకు ఇబ్బంది ఏర్పడుతుంది. భవిష్యత్తులో ఇంకా ఇబ్బంది ఉంటుందని కొందరు అంటున్నారు. మరి వచ్చే ఒక 20 ఏళ్లలో ఎలాంటి ఉద్యోగాలకు మంచి అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే కొన్ని రంగాలు పడిపోతున్నాయి. ఎందరో ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇదే కనుక జరిగితే వచ్చే కొన్నేళ్లకు అసలు చాలా ఉద్యోగాలు పోతాయి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 13, 2024 / 12:23 AM IST

    Jobs

    Follow us on

    Jobs: ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయింది. అంతా కూడా ఏఐతో నడుస్తోంది. వీటివల్ల ఇప్పటికీ కొన్ని ఉద్యోగాలకు కొరత ఏర్పడుతోంది. అలాంటిది ఇంకా వచ్చే ఏళ్లలో అంటే కష్టమే. సాఫ్ట్‌వేర్ కంపెనీ అయితే ఎందరో ఉద్యోగస్థులను తీసేస్తుంది. ఏఐ వల్ల ఇప్పటికే కొన్ని ఉద్యోగాలకు ఇబ్బంది ఏర్పడుతుంది. భవిష్యత్తులో ఇంకా ఇబ్బంది ఉంటుందని కొందరు అంటున్నారు. మరి వచ్చే ఒక 20 ఏళ్లలో ఎలాంటి ఉద్యోగాలకు మంచి అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే కొన్ని రంగాలు పడిపోతున్నాయి. ఎందరో ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇదే కనుక జరిగితే వచ్చే కొన్నేళ్లకు అసలు చాలా ఉద్యోగాలు పోతాయి. ఎంత టెక్నాలజీ మారిన కూడా కొన్ని రంగాల ఉద్యోగస్థులకు మాత్రం మంచి డిమాండ్ ఉంటుంది. మరి ఏ ఫీల్డ్ ఉద్యోగస్థులకు మంచి వేతనం లభిస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    ఏఐ నిపుణులు
    ఏఐ సిస్టమ్‌లు, అప్లకిషన్లను రూపొందించడానికి, అభివృద్ధి చేయడానికి భవిష్యత్తులో మంచి డిమాండ్ ఏర్పడుతుంది. వీరికి రూ.50 లక్షల నుంచి కోటి వరకు వేతనం ఇస్తారు. ఏఐ నిపుణుడు మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, రోబోటిక్స్ లేదా డీప్ లెర్నింగ్‌తో వంటి రంగాల వారికి అధిక వేతనం లభిస్తుంది.

    మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్
    ఈ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్‌లో ఉద్యోగం సంపాదిస్తే రూ.45 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు జీతం వస్తుంది. టెక్నాలజీ మారుతుండటంతో వచ్చే ఏళ్లలో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్‌కి అవకాశాలు లభిస్తాయి.

    రోబోటిక్స్ ఇంజనీర్
    రోబోటిక్ ఇంజనీర్లకు కూడా మంచి డిమాండ్ వస్తుంది. మెకానికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, సాంకేతికతలను ఉపయోగించి రోబోట్‌లు వాటి సిస్టమ్‌లను అభివృద్ధి చేస్తారు. వీరికి ఏడాదికి రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు జీతం వస్తుంది. వచ్చే 20 ఏళ్లలో వీరికి భారీ డిమాండ్ ఉంటుందట.

    డేటా సైంటిస్ట్
    డేటాను విశ్లేషించడానికి, గణాంకాలు, కంప్యూటర్ సైన్స్ వంటి వాటికి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ డేటా సైంటిస్ట్‌లకు ఏడాదికి రూ. 35 లక్షల నుంచి రూ.85 లక్షల వరకు జీతం వస్తుంది.

    క్వాంటం కంప్యూటింగ్ పరిశోధకుడు
    భవిష్యత్తులో క్వాంటం కంప్యూటర్‌లకు భారీ డిమాండ్ ఉంటుంది. క్వాంటం అల్గారిథమ్‌లను మూల్యాంకనం చేయడం, క్వాంటం నిర్వచనాలను రూపొందించడం, అభివృద్ధి చేయడం కోసం వీరిని సెలక్ట్ చేసుకుంటారు. ఈ క్వాంటం కంప్యూటింగ్ పరిశోధకుడుకు ఏడాదికి రూ.40 లక్షల నుంచి రూ.85 లక్షల వేతనం లభిస్తుందట.

    బయోటెక్నాలజీ పరిశోధకుడు
    బయోటెక్నాలజీ పరిశోధకుడుకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుది. ఏడాదికి వీరికి రూ.40 లక్షల నుంచి రూ.85 లక్షల వరకు వేతనం లభిస్తుంది. బయో టెక్నాలజీ, జీవశాస్త్రం, బయో కెమిస్ట్రీ లేదా బయో మెడికల్ ఇంజనీరింగ్‌ను అధ్యయనం చేసే వారికి మంచి డిమాండ్ ఉంటుంది.