https://oktelugu.com/

అమర రాజా సంస్థలో 200 ఉద్యోగ ఖాళీలు.. పది, ఇంటర్ అర్హతతో..?

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్రముఖ సంస్థలలో ఒకటైన అమర రాజా సంస్థలో 200 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజైంది. పది, ఇంటర్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు మిషన్ ఆపరేటర్ విభాగంలో పని చేయాల్సి ఉంటుందని సమాచారం. ఆగష్టు నెల 16వ తేదీ ఈ ఉద్యోగ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 13, 2021 / 09:07 AM IST
    Follow us on


    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్రముఖ సంస్థలలో ఒకటైన అమర రాజా సంస్థలో 200 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజైంది. పది, ఇంటర్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు మిషన్ ఆపరేటర్ విభాగంలో పని చేయాల్సి ఉంటుందని సమాచారం.

    ఆగష్టు నెల 16వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://apssdc.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలిసే అవకాశం ఉండటంతో పాటు రిజిష్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను కూడా తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    ఐటీఐ అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు నెలకు రూ.11,500 వేతనం లభించనుంది.

    ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు షిఫ్ట్ ల విధానంలో పని చేయాల్సి ఉంటుంది. సబ్సిడీపై ఫుడ్, వసతి పొందే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా https://apssdc.in/industryplacements/ వెబ్ సైట్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.