గ్యాస్ సబ్సిడీ మీకు అందడం లేదా.. ఏం చేయాలంటే..?

దేశంలో కోట్ల సంఖ్యలో గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. గ్యాస్ సిలిండర్ ధరలు అంతకంతకూ పెరుగుతుండగా పెరుగుతున్న ధరల వల్ల సామాన్యులపై భారీస్థాయిలో భారం పడుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ సబ్సిడీని ఖాతాల్లో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ గత కొన్ని నెలల నుంచి ఖాతాలలో సబ్సిడీ జమ కావడం లేదని ఫిర్యాదు చేసేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే మన ఖాతాల్లో గ్యాస్ సిలిండర్ రాయితీ జమవుతుందా..? లేదా..? అనే విషయాన్ని సులభంగా […]

Written By: Kusuma Aggunna, Updated On : August 13, 2021 9:22 am
Follow us on

దేశంలో కోట్ల సంఖ్యలో గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. గ్యాస్ సిలిండర్ ధరలు అంతకంతకూ పెరుగుతుండగా పెరుగుతున్న ధరల వల్ల సామాన్యులపై భారీస్థాయిలో భారం పడుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ సబ్సిడీని ఖాతాల్లో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ గత కొన్ని నెలల నుంచి ఖాతాలలో సబ్సిడీ జమ కావడం లేదని ఫిర్యాదు చేసేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

అయితే మన ఖాతాల్లో గ్యాస్ సిలిండర్ రాయితీ జమవుతుందా..? లేదా..? అనే విషయాన్ని సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇండేన్ గ్యాస్ కస్టమర్లు www.mylpg.in వెబ్ సైట్ ద్వారా రాయితీ సొమ్ము గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఏ సంస్థ నుంచి గ్యాస్ పొందుతున్నామో ఆ సంస్థ సిలిండర్ పై క్లిక్ చేసి సబ్సిడీ రిలేటెడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్ కేటగిరీ సబ్సిడీ నాట్ రీసీవుడ్ పై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత ఎల్పీజీ ఐడీ నంబర్ లేదా రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సబ్సిడీ జమ కాని పక్షంలో ఫిర్యాదు చేయడం ద్వారా రాయితీ డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. భారత్, హెచ్.పీ గ్యాస్ కస్టమర్లు www.mylpg.in వెబ్ సైట్ ద్వారా వివరాలను ఎంటర్ చేసి “వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఎంత చెల్లించామో సబ్సిడీ ఎంతో తెలుసుకోవచ్చు.

ఆధార్ లింక్ చేయకపోవడం లేదా వార్షిక ఆదాయం 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఉంటే సబ్సిడీ పొందలేము. బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుతో లింక్ కాకపోయినా సబ్సిడీని పొందడం సాధ్యం కాదనే సంగతి తెలిసిందే.