Jobs: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం గమనార్హం. మొత్తం 249 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
ఫుట్‌బాల్, హాకీ, షూటింగ్, స్విమ్మింగ్ క్రీడలతో పాటు అథ్లెటిక్స్, బాక్సింగ్, బాస్కెట్ బాల్, జిమ్నాస్టిక్స్ లో ప్రావీణ్యం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు రాష్ట్ర/జాతీయ/అంతర్జాతీయ స్థాయి గేమ్స్, స్పోర్ట్స్, అథ్లెటిక్స్‌లో పాల్గొనడంతో పాటు కనీసం ఇంటర్ పాసై ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: అమరావతి పేరు మీద అప్పు కోసం జగన్ ప్రయత్నాలు?
18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పురుషులతో పాటు మహిళలు సైతం ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్‌టీ), డాక్యుమెంటేషన్, ట్రయల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
2022 సంవత్సరం మార్చి నెల 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు మేలు జరుగుతుంది.
Also Read: పీఆర్సీపై తేలని పంచాయితీ.. అసంపూర్తిగా ముగిసిన చర్చలు