https://oktelugu.com/

TRAI Recruitment 2021: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో జాబ్స్.. భారీ వేతనంతో

TRAI Recruitment 2021: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కన్సల్టెంట్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. మొత్తం 7 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. మొత్తం 7 ఉద్యోగ ఖాళీలలో బ్రాడ్‌కాస్టింగ్‌ అండ్‌ కేబుల్‌ సర్వీసెస్‌, బ్రాడ్‌ బ్యాండ్‌ అండ్‌ పాలిసీ అనాలసిసీన్‌, ఫైనాన్షియల్‌ అండ్‌ ఎకనమిక్‌ అనాలసిస్‌, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 22, 2021 / 09:48 AM IST
    Follow us on

    TRAI Recruitment 2021: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కన్సల్టెంట్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. మొత్తం 7 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. మొత్తం 7 ఉద్యోగ ఖాళీలలో బ్రాడ్‌కాస్టింగ్‌ అండ్‌ కేబుల్‌ సర్వీసెస్‌, బ్రాడ్‌ బ్యాండ్‌ అండ్‌ పాలిసీ అనాలసిసీన్‌, ఫైనాన్షియల్‌ అండ్‌ ఎకనమిక్‌ అనాలసిస్‌, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, టెక్నాలజీ డెవపల్‌మెంట్‌ యూనిట్‌ విభాగాల్లో జాబ్స్ ఉన్నాయి.

    TRAI Recruitment 2021

    గ్రాడ్యుయేషన్‌, బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీలో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 32 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఆఫ్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

    Also Read:  అర్హతతో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

    ఈ ఉద్యోగ ఖాళీలపై ఆసక్తి ఉన్నవాళ్లు మొదట ట్రాయ్ వెబ్ సైట్ నుంచి ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పీడీఎఫ్ ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకుని ఆ ఫామ్ ను నింపాల్సి ఉంటుంది. సీనియర్‌ రిసెర్చ్‌ ఆఫీసర్‌, ట్రాయ్‌, మహానగర్‌ దూర్‌ సంచార్‌ భవన్‌, న్యూఢిల్లీ 110002 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

    2021 సంవత్సరం జనవరి 27వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.trai.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read: నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో గ్రూస్‌ సీ జాబ్స్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?