https://oktelugu.com/

Jobs: అనంతపూర్ డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌లో జాబ్స్.. ఎలా ఎంపిక చేస్తారంటే?

Jobs: అనంతపూర్ డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవాళ్లకు ప్రయోజనం చేకూరేలా ఈ బ్యాంక్ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అనంతపురం జిల్లాలో ఉన్న ఈ సంస్థ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 86 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. అసిస్టెంట్‌లు/క్లర్కులు, అసిస్టెంట్ మేనేజర్ల ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 23, 2021 / 05:13 PM IST
    Follow us on

    Jobs: అనంతపూర్ డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవాళ్లకు ప్రయోజనం చేకూరేలా ఈ బ్యాంక్ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అనంతపురం జిల్లాలో ఉన్న ఈ సంస్థ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 86 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. అసిస్టెంట్‌లు/క్లర్కులు, అసిస్టెంట్ మేనేజర్ల ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి.

    Also Read: బీటెక్ అర్హతతో ప్రభుత్వ సంస్థల్లో జాబ్స్.. నెలకు 60,000 రూపాయల వేతనంతో?

    45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు స్టాఫ్‌ అసిస్టెంట్‌లు/క్లర్కులు ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ తో పాటు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ పాసైన వాళ్లు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి.

    ఎకనామిక్స్‌/స్టాటిస్టిక్స్‌/తత్సమాన సబ్జెక్టుల్లో పీజీ చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ తో పాటు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.

    ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 చొప్పున నెగిటివ్‌ మార్కింగ్‌ ఉండటంతో పాటు 100 మార్కులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్షను నిర్వహిస్తారు. 2021 సంవత్సరం డిసెంబర్ 3వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

    Also Read: అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగ ఖాళీలు.. అర్హులెవరంటే?