https://oktelugu.com/

Naveen chandra: ఆకట్టుకుటున్న తగ్గేదే లే పోస్టర్​.. క్రైమ్ థ్రిల్లర్​తో రానున్న నవీన్​

Naveen chandra: చేసింది చిన్న సినిమాలే అయినా.. కెరీర్​లో ప్రేక్షకులకు గుర్తుండిపోయే విధంగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్​ చంద్ర. తాజాగా, మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. నవీన్ హీరోగా, శ్రీనివాస రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తగ్గేదే లే.. క్రైమ్​ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందించారు. కాగా, భద్ర ప్రొడక్షన్స్ ఈ సినిమాతో టాలీవుడ్​లో అతిపెద్ద నిర్మాణ సంస్థగా అడుగుపెట్టనుంది. ఈ సంస్థకు ఇదే తొలి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 24, 2021 / 09:44 AM IST
    Follow us on

    Naveen chandra: చేసింది చిన్న సినిమాలే అయినా.. కెరీర్​లో ప్రేక్షకులకు గుర్తుండిపోయే విధంగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్​ చంద్ర. తాజాగా, మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. నవీన్ హీరోగా, శ్రీనివాస రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తగ్గేదే లే.. క్రైమ్​ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందించారు. కాగా, భద్ర ప్రొడక్షన్స్ ఈ సినిమాతో టాలీవుడ్​లో అతిపెద్ద నిర్మాణ సంస్థగా అడుగుపెట్టనుంది. ఈ సంస్థకు ఇదే తొలి చిత్రం.

    https://twitter.com/BhadraProdns/status/1462996761211854848?s=20

    ఈ సినిమాలో నవీన్​కు జోడీగా దివ్యా పిళ్లై నటించింది. కాగా, దివ్వా పిళ్లై పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్​లుక్​ విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ పోస్టర్​ నెట్టింట్లో వైరల్​గా మారింది.

    ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లు జనాల్లో మంచి ఆదరన దక్కించుకున్నాయి. కాగా, త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో దివ్యా పిళ్లైతో పాటు అనన్య సేనుగుప్తా హీరోయిన్​గా కనిపించనుంది. కాగా, నాగబాబు, డానీ కుట్టప్ప, రవికాలే, తదితరులు కీలక పాత్రలో పోషించారు.

    అందాల రాక్షసి సినిమా తర్వాత పెద్దగా హిట్​ కొట్టలేకపోయారు నవీన్​. ఇటీలవే అరవింద సమేతలో జగపతి బాబు కొడుకుగా నటించి మంచి మెప్పును పొందాడు. అందులో తన నటనకు జనాలు నీరాజనాలు పట్టారు. ఇప్పుడు మళ్లీ హీరోగా తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.