Jobs: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. తిరుచిరపల్లిలోని క్యాంపస్‌లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. మొత్తం 22 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, అర్కిటెక్చర్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగాల్లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.
35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఆన్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 50,000 రూపాయల వేతనం లభిస్తుంది. పని ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు తుది ఎంపిక ప్రక్రియ జరుగుతుందని చెప్పవచ్చు.
2022 సంవత్సరం జనవరి 2వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. 2022 సంవత్సరం జనవరి 6వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. https://www.nitt.edu/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.