https://oktelugu.com/

Jobs: పదో తరగతి అర్హతతో భారీగా ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.67,000 వేతనంతో?

Jobs: ఐసీఎంఆర్‌ – నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ అనుభవం ఉండి కొత్త ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. మొత్తం 8 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది. 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 2, 2022 / 10:48 AM IST
    Follow us on

    Jobs: ఐసీఎంఆర్‌ – నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ అనుభవం ఉండి కొత్త ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. మొత్తం 8 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని సమాచారం అందుతోంది. 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు.

    ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 17,000 రూపాయల నుంచి 67,200 రూపాయల వరకు వేతనం లభించనుందని తెలుస్తోంది. ఆన్ లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలపై ఆసక్తిని కలిగి ఉంటారో వాళ్లు ఈమెయిల్ ద్వారా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. recruitmentnivku@gmail.com మెయిల్ కు ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి.

    2022 సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. https://niv.co.in/ వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పదో తరగతి లేదా తత్సమాన అర్హతతో ఇంటర్, ఐటీఐ చదివి డీఎంఎల్‌టీ, యూజీ, పీజీ (ఎండీ/ఎంఎస్‌) పాసై అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    ఈ ఉద్యోగ ఖాళీలలో ప్రాజెక్ట్‌ టెక్నికల్‌- 2 (ఫీల్డ్‌ అసిస్టెంట్‌), ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ (సోషల్‌ సైన్స్‌), ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ – 1, ప్రాజెక్ట్‌ సెంటిస్ట్‌ సి (మెడికల్‌), ప్రాజెక్ట్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ప్రాజెక్ట్‌ మల్లీటాస్కింగ్‌ స్టాఫ్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ సి ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అనుభవం ఉన్న ఉద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.