https://oktelugu.com/

Jobs: తిరుప‌తి ఐస‌ర్‌లో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండా?

Jobs: ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్‌ నిరుద్యోగులకు తాజాగా మరో శుభవార్తను అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. భార‌త ప్ర‌భుత్వ విద్యా మంత్రిత్వ‌శాఖ‌కు సంబంధించిన ఈ సంస్థ కాంట్రాక్ట్ విధానం ద్వారా రెండు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో/ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సంబంధిత […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 15, 2022 / 10:45 AM IST
    Follow us on

    Jobs: ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్‌ నిరుద్యోగులకు తాజాగా మరో శుభవార్తను అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. భార‌త ప్ర‌భుత్వ విద్యా మంత్రిత్వ‌శాఖ‌కు సంబంధించిన ఈ సంస్థ కాంట్రాక్ట్ విధానం ద్వారా రెండు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో/ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

    సంబంధిత సబ్జెక్టులలో కనీసం 55 శాతం మార్కులు సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఎమ్మెస్సీ/తత్స‌మాన ఉత్తీర్ణత పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలలో జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీలు కూడా ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఈమెయిల్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    gopi@labs.iisertirupati.ac.in ఈమెయిల్ ఐడీకి సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 31,000 రూపాయలతో పాటు హెచ్ఆర్ఏ లభిస్తుంది. భారీ వేతనం లభిస్తుండటంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.

    ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా 2 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా http://www.iisertirupati.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.