https://oktelugu.com/

karthika Deepam: సౌందర్య వాళ్లను చూసిన కార్తీక్.. మోనితవైపు ప్లేట్ మారుస్తున్న బస్తీ వాళ్ళు!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక్ పిల్లలకు భోజనం వడ్డిస్తూ వాళ్ళ ఆకలి గురించి మాట్లాడుతాడు. పిల్లల ఆకలి గురించి తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది అని అనటంతో అప్పుడే సౌర్య ఆనందరావు, సౌందర్య వాళ్లను గుర్తుకు వచ్చేస్తుంది. నానమ్మ వాళ్ళు కూడా నీమీద చాలా ప్రేమ చూపించారని కానీ ఇప్పుడు ఎంత బాధ పడుతున్నారో అని అనడంతో కార్తీక్ ఆలోచనలో పడతాడు. ఇక లక్ష్మణ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 15, 2022 / 10:53 AM IST
    Follow us on

    Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక్ పిల్లలకు భోజనం వడ్డిస్తూ వాళ్ళ ఆకలి గురించి మాట్లాడుతాడు. పిల్లల ఆకలి గురించి తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది అని అనటంతో అప్పుడే సౌర్య ఆనందరావు, సౌందర్య వాళ్లను గుర్తుకు వచ్చేస్తుంది. నానమ్మ వాళ్ళు కూడా నీమీద చాలా ప్రేమ చూపించారని కానీ ఇప్పుడు ఎంత బాధ పడుతున్నారో అని అనడంతో కార్తీక్ ఆలోచనలో పడతాడు.

    ఇక లక్ష్మణ్ వాళ్లు మోనిత దగ్గరికి వెళ్లి తన భార్య ఆరోగ్యం బాగు చేసినందుకు తనకు ధన్యవాదాలు తెలుపుకుంటారు. గతంలో అన్న మాటలు పట్టించుకోకుండా మాకు సహాయం చేశారు అని.. ఇప్పటినుంచి మీ దగ్గరే ఉంటాము అంటూ మోనితకు మాట ఇస్తారు. ఇక మోనిత అనుకున్నది సాధించినట్లు గా ఫీల్ అవుతుంది. మరోవైపు రుద్రాణి కి తన మనిషి ఇంట్లో నుంచి కాఫీ తేవడంతో అతడిపై అరుస్తుంది. వంటగది చూస్తే దీప దైర్యం గుర్తుకు వస్తుందని అందులోకి నుంచి ఏమి తీసుకురావద్దని అంటుంది.

    బాబును, హిమ ను చూస్తే తనకు ముచ్చటగా అనిపిస్తుంది అని వాళ్లని దత్తత తీసుకుంటానని అంటుంది. మరోవైపు కార్తిక్ ఒంటరిగా కూర్చొని గతంలో ఇంట్లో గడిపిన అద్భుతమైన క్షణాలను తలచుకుంటాడు. అంతలోనే దీప రావటంతో దీపతో ఎన్నో కష్టాలు పెడుతున్నానని చెబుతూ బాధపడతాడు. పిల్లలు ప్రశ్నలు వేస్తున్నారని పిల్లల్లో ఆలోచనలు వస్తున్నాయని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

    ఇక హోటల్లో అప్పు మోనితతో దిగిన ఫోటో చూసుకుంటూ మురిసిపోతాడు. ఆమెది మంచి మనసు అని కార్తీక్ తో చెబుతూ ఉంటాడు. ఇక అప్పు మోనిత, కార్తీక్ లను ఒక దగ్గర ఊహించుకొని మంచి జోడి అనేసరికి కార్తీక్ షాక్ అవుతాడు. ఇక దీప రుద్రాణి గురించి ఆలోచిస్తూ ఏదో ఒకటి చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. తరువాయి భాగం లో కార్తీక్ ప్రకృతి వైద్యశాల కు వెళ్లి ఆనందరావు, సౌందర్య వాళ్లను చూసి షాక్ అవుతూ బాగా ఎమోషనల్ అవుతాడు.