ఆయుష్ మంత్రిత్వశాఖ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల కొరకు ఈ సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. నిరుద్యోగులు నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం 5 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ విభాగంలో దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రగ్ పాలసీ సెక్షన్, మినిస్టరీ ఆఫ్ ఆయుష్, ఎన్‌బీసీసీ, ఆఫీస్ బ్లాక్ 3, న్యూఢిల్లీ, 110023 అడ్రస్‌కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ప్రోగ్రాం మేనేజర్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 50,000 రూపాయల వేతనం లభిస్తుంది.
డేటా అనలిస్ట్/డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 20,000 రూపాయల వరకు వేతనం లభించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నవంబర్ 25వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ కాగా నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.