బీటెక్ అర్హతతో ఎన్టీపీసీలో ఉద్యోగ ఖాళీలు.. రూ.60,000 వేతనంతో?

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాలలో ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు మూడు సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు ఉత్తరాఖాండ్ లో పని చేయాల్సి ఉంటుంది. మూడు సంవత్సరాల తర్వాత కాంట్రాక్ట్ ను […]

Written By: Navya, Updated On : November 18, 2021 8:07 am
Follow us on

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాలలో ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు మూడు సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు ఉత్తరాఖాండ్ లో పని చేయాల్సి ఉంటుంది.

మూడు సంవత్సరాల తర్వాత కాంట్రాక్ట్ ను పొడిగించే అవకాశాలు కూడా ఉంటాయి. నవంబర్ 16వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నవంబర్ 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://careers.ntpc.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.

మొత్తం 15 ఉద్యోగ ఖాళీలలో మెకానికల్ ఉద్యోగ ఖాళీలు 5 ఉండగా సివిల్ ఉద్యోగ ఖాళీలు 10 ఉన్నాయి. బీఈ లేదా బీటెక్ లో కనీసం 60 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 60,000 రూపాయల వేతనం లభించనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు ఉండాలి.

ఈ ఉద్యోగ ఖాళీలకు రిజిస్ట్రేషన్ ఫీజు 300 రూపాయలుగా ఉండనుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. https://careers.ntpc.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.