https://oktelugu.com/

Jobs:  నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగ ఖాళీలు.. మంచి జీతంతో?

Jobs:  నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం. జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ట్రాఫిక్‌ అండ్‌ టోల్‌ రెవెన్యూ, ఫైనాన్స్‌, ఎఫ్‌ అండ్ ఏ విభాగాలలో ఈ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 14, 2022 10:10 am
    Follow us on

    Jobs:  నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం. జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.

    ట్రాఫిక్‌ అండ్‌ టోల్‌ రెవెన్యూ, ఫైనాన్స్‌, ఎఫ్‌ అండ్ ఏ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత సాధించి కనీసం 15 సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు జనరల్ మేనేజర్ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సీఏ/ ఐసీడబ్ల్యూఏ పాసై 10 సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు డిప్యూటీ జనరల్‌ మేనేజర్ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు.

    సంబంధిత స్పెషలైజేషన్ లో గ్రాడ్యుయేషన్ తో పాటు 5 సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవాళ్లు hr.nhiimpl@nhai.org వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను పంపే అవకాశం ఉంటుంది. 2022 సంవత్సరం జనవరి 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

    వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది. ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉండటం గమనార్హం.