JEE Main Results
JEE Main Results: జేఈఈ మెయిన్ సీజన్–2 పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) గురువారం ఫలితాలు విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. దేశావ్యాప్తంగా 56 మంది 100 పర్సంటైల్ స్కోర్ సాధించగా ఇందలో 22 మంది తెలుగు విద్యార్థులే ఉండడం విశేషం. ఈ ఘనత సాధించిన వారిలో తెలంగాణ నుంచి 15 మంది ఏపీ నుంచి ఏడుగురు ఉన్నారు.
షెడ్యూల్‌కు ఒకరోజు ముందే..
ఏప్రిల్ 22న జేఈఈ మెయిన్ తుది కీని ఎన్‌టీఏ విడుదల చేసింది. ఇక ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కన్నా ఒకరోజు ముందే ఫలితాలు ప్రకటించింది. ఈమేరకు వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి స్కోర్ కార్డులు పొందవచ్చు.
సెషన్ – 1లో 23 మందికే 100 పర్సంటైల్..
జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్ సెషన్–1 పరీక్షకు దేశవ్యాప్తంగా 12,21624 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 23 మంది విద్యార్థులు మాత్రమే 100 పర్సంటైల్ సాధించారు. ఇక ఏప్రిల్ 4 నుంచి 12 వరకు జరిగిన జేఈఈ మెయిన్ సెషన్–2 పరీక్షకు 12.57 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ సీజన్‌లో ఏకంగా 56 మంది 100 పర్సంటైల్ సాధించారు. మొత్తంగా రెండు సెషన్లకు హాజరైన విద్యార్థులు సాధించిన మెరుగైన స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుని ఎన్‌టీఏ మెరిట్ లిస్టును విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసింది. కేటరిగీల వారీగా కటాఫ్‌ను సైతం ప్రకటించింది. రాష్ట్రాల వారీగా టాపర్స్ మార్కులను ప్రకటించిది.
27 నుంచి ‘అడ్వాన్స్‌డ్’కు దరఖాస్తులు
జేఈఈ మెయిన్‌లో కటాఫ్ మార్కులు సాధించిన 2.50 లక్షల మందికి అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అవకాశం ఉంది. దీనికి ఏప్రిల్ 27 నుంచి మే 7వ తేదీ వరకు ఐఐటీ మద్రాస్ దరఖాస్తులు స్వీకరిస్తుంది. మే 17 నుంచి 26 వరకు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయి. మే 26న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1 పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్–2 పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాలను జూర్ 9న విడుదల చేస్తారు.
100 పర్సంటైల్ సాధించిన తెలంగాణ విద్యార్థులు..
1. హందేకర్ విదిత్
2. ముత్తవరపు అనూప్
3. వెంకటసాయితేజ మదినేని
4. రెడ్డి అనిల్
5. రోహన్‌సాయిబాబా
6. శ్రీయాశస్ మోహన్ కల్లూరి
7. కేసం చన్నబసవరెడ్డి
8. మురికినాటి సాయిదివ్యతేజరెడ్డి
9. రిషిశేఖర్ శుక్లా
10 తవ్వ దినేశ్‌రెడ్డి
11.గంగ శ్రేయాస్
12. పొలిశెట్టి రితీష్ బాలాజీ
13.తమటం జయదేవ్‌రెడ్డి
14.మావూరు జస్విత్
15. దొరిసాల శ్రీనివాస్‌రెడ్డి.
100 పర్సంటైల్ సాధించిన ఏపీ విద్యార్థులు..
1. చింటు సతీశ్‌కుమార్
2. షేక సూరజ్
3. మకినేని జిష్ణుసాయి
4. తొటంశెట్టి నిఖిలేష్
5. అన్నంరెడ్డి వెంకటతనిష్‌రెడ్డి
6. తోట సాయి కార్తీక్
7. మురసాని సాయి యశ్వంత్‌రెడ్డి.