ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఒకటైన కాగ్నిజెంట్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 23,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్టు కీలక ప్రకటన చేసింది. గతేడాదితో పోలిస్తే కాగ్నిజెంట్ సంస్థ ఏకంగా 35 శాతం మందిని నియమించుకోనున్నట్టు తెలుస్తోంది. సంస్థ సీఎండీ రాజేశ్ నంబియార్ ఈ విషయాన్ని వెల్లడించారు. కాగ్నిజెంట్ కంపెనీ ఇంటర్న్‌షిప్ లకు కూడా బాగానే ప్రాధాన్యత ఇస్తోందని సమాచారం.
Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలు..?
గతేడాది కాగ్నిజెంట్ కంపెనీ 17,000 మందికి పైగా కొత్త గ్రాడ్యుయేట్లను నియమించుకోగా ఈ ఏడాది అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటూ ఉండటం గమనార్హం. ఈ సంస్థ దేశంలో భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకుంటున్న సంస్థలలో ఒకటి కావడం గమనార్హం. ఈ ఏడాది జనవరి నెల నుంచి మార్చి నెల మధ్యలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది.
Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఐటీఐ అర్హతతో నావీలో ఉద్యోగాలు..?
సంస్థ సీఎండీ రాజేశ్ నంబియార్ మాట్లాడుతూ ప్రతిభ ఉన్న ఇంజనీరింగ్, సైన్స్, మేనేజ్‌మెంట్ విద్యార్థులు, ఇతర నిపుణుల నియామకం చేపట్టినట్టు వెల్లడించారు. భారత్ నిపుణులను దక్కించుకోవడంలో కీలక కేంద్రాల్లో ఒకటిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 1,30,000 మంది ఉద్యోగులకు 18 నెలల కాలంలో ఉద్యోగ నైపుణ్యాలను కల్పించినట్టు నంబియార్ పేర్కొన్నారు. గతేడాది 5000 మంది ఇంటర్న్ షిప్ పూర్తి చేయగా ఈ ఏడాది 10,000 మంది ఇంటర్న్ షిప్ పూర్తి చేసే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.
మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు
ప్రస్తుతం మన దేశంలో ఈ సంస్థకు 2.04 లక్షల మంది ఉద్యోగులు ఉండగా సంస్థ ఉద్యోగుల సంఖ్యను అంతకంతకూ పెంచుకుంటూ ఉండటం గమనార్హం. ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌లో ఫ్రెషర్ల నియామకాలు భారీగా జరగనున్న నేపథ్యంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.