ISRO Recruitment 2021 Notification: ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) తాజాగా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సంస్థలో మొత్తం 8 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్సన్ సిస్టమ్స్ సెంటర్ లో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం.
ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా సెప్టెంబర్ 6వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఉద్యోగ ఖాళీల సంఖ్య తక్కువగా ఉండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే హెవీ వెహికిల్ డ్రైవర్ ఉద్యోగ ఖాళీలు 2, లైట్ వెహికిల్ డ్రైవర్ ఉద్యోగ ఖాళీలు 2, కుక్ 1, ఫైర్ మాన్ 2, క్యాటరింగ్ అటెండెంట్ ఉద్యోగ ఖాళీలు 1 ఉన్నాయి. పదోతరగతి విద్యార్హత కలిగిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 150 రూపాయలుగా ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 18,000 రూపాయల నుంచి 63,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.
https://www.lpsc.gov.in/noticeresult.html#demo2 లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ ద్వారా వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోలేమని అధికారులు స్పష్టం చేస్తుండటం గమనార్హం.