నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ ఆయిన్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు..?

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 505 ఉద్యోగాల భర్తీ కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. డిప్లొమా, ఐటీఐ, ఇంటర్‌, డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 26 దరఖాస్తులకు చివరితేదీగా ఉంది. ‌https://iocl.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 2021 సంవత్సరం మార్చి 14వ […]

Written By: Kusuma Aggunna, Updated On : February 9, 2021 8:12 pm
Follow us on

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 505 ఉద్యోగాల భర్తీ కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. డిప్లొమా, ఐటీఐ, ఇంటర్‌, డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 26 దరఖాస్తులకు చివరితేదీగా ఉంది. ‌https://iocl.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 2021 సంవత్సరం మార్చి 14వ తేదీన రాతపరీక్ష ఉంటుంది. ఈ ఉద్యోగాలకు 2021 సంవత్సరం మార్చి 1వ తేదీ అడ్మిట్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఈ ఉద్యోగాలకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్రెంటిస్‌షిప్ కాలవ్యవధి 12 నెలల నుంచి 15 నెలల వరకు ఉంటుందని తెలుస్తోంది. 2021 సంవత్సరం జనవరి 31 నాటికి 24 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలను అనుసరించి వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఐటీఐ, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు బిహార్, ఒడిషా, జార్ఖండ్, అసోం, పశ్చిమబెంగాల్ లలో పని చేయాల్సి ఉంటుంది.

మొత్తం 505 ఉద్యోగ ఖాళీలలో డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెషినిస్ట్, ఫిట్టర్, రిటైల్ సేల్స్ అసోసియేట్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.