Homeఎడ్యుకేషన్AP Inter Board: ఇంటర్ బోర్డు పరీక్ష రద్దు.. సిలబస్ సగానికి తగ్గింపు.. ప్రభుత్వం...

AP Inter Board: ఇంటర్ బోర్డు పరీక్ష రద్దు.. సిలబస్ సగానికి తగ్గింపు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం?

AP Inter board: ప్రభుత్వాలు మారిన తర్వాత అన్ని రంగాలతో పాటు విద్యావ్యవస్థలో కూడా మార్పులు జరుగుతాయి. కొత్తగా వాళ్ల పాలన మార్క్ చూపించాలనే ఉద్దేశంతో లేదా విద్యార్థుల భవిష్యత్తు కోసం మార్పులు, చేర్పులు చేస్తుంటారు. ఎప్పటికప్పుడే విద్యావిధానాలపై మార్పులు చేస్తుంటారు. ఈక్రమంలో ఎన్నోసార్లు సిలబస్, పరీక్ష విధానంలో మార్పులు చేశారు. మళ్లీ ఈసారి కూడా మార్పులు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇంటర్మీడియట్ సిలబస్ విధానంలో మార్పులు చేయడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పరీక్షల్లో మార్పులు చేయడంతో పాటు సిలబస్‌ కూడా తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. అయితే వచ్చే ఏడాది నుంచి ఈ మార్పులు రానున్నాయి. దీనిపై ఉన్నత విద్యాశాఖ చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత నూతన విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎన్సీఈఆర్టీ సిలబస్‌తో పోల్చితే మన రాష్ట్ర బోర్డు సిలబస్ ఎక్కువగా ఉంది. దీనిని తగ్గించాలని బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు భావిస్తుంది. ఈక్రమంలో గణితం సబ్జెక్ట్‌లో కొంత వరకు తగ్గించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతానికి గణిత రెండు పేపర్లు ఉన్నాయి. అయితే సిలబస్ తగ్గించిన తర్వాత రెండు పేపర్లను కొనసాగిస్తారా? ఒక పేపర్ ఉంచుతారా? అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. బైపీసీ గ్రూప్‌లో అయితే ఎన్సీఈఆర్టీలో కేవలం జీవశాస్త్రం మాత్రమే ఉంది. ఇంటర్‌ బైపీసీలో బాటనీ, జీవశాస్త్రం సబ్జెక్ట్‌లు వేర్వేరుగా ఉన్నాయి. వీటిపైన కూడా బోర్డు ఆలోచిస్తుంది. అయితే ఇంటర్మీడియట్‌లో బోర్డు పరీక్షలు రెండేళ్లు జరుగుతాయి. కానీ సీబీఎస్‌ఈలో 11వ తరగతికి సంబంధించి బోర్డు పరీక్ష అసలు లేదు. కేవలం అంతర్గత పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు. అయితే ఇదే విధానాన్ని రాష్ట్ర భోర్డులోకి తీసుకురావడం ఎలా ఉంటుందని బోర్డు అధికారులు ఆలోచిస్తున్నారు. కొత్తగా మళ్లీ ఇలా తీసుకురావడం వల్ల విద్యార్థులపై ఒత్తిడిపై పడుతుందా? లేకపోతే తగ్గుతుందా? అనే కోణాల్లో ఆలోచిస్తున్నారు.

ఇంటర్‌లో జనరల్ సబ్జెక్టులతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్, వొకేషనల్ సబ్జెక్టులను ప్రవేశ పెట్టాలని భావిస్తున్నారు. అయితే వీటిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై ఆలోచించి ఈ విధానాలను పూర్తి చేసేందుకు ఇంటర్ బోర్డుకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కేవలం వాళ్ల నిర్ణయంతోనే సిలబస్, పరీక్ష విధానాల్లో మార్పులు చేయాలని అనుకోవడం లేదు. కాలేజీ యాజమాన్యంతో పాటు తల్లిదండ్రులు, విద్యార్థుల అభిప్రాయాలను కూడా తీసుకుని ఈ నిర్ణయం తీసుకోనున్నది. అందరి నుంచి వచ్చిన ప్రతిపాదనలను తీసుకుని ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఆ తర్వాత ఉన్నత స్థాయిలో దీనిపై చర్చ జరిపాక నిర్ణయం తీసుకోనున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version