ఎన్‌ఎల్‌సీలో ఇండస్ట్రియల్‌ ట్రెయినీ ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎల్‌సీ) నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన ఈ సంస్థ ఇండస్ట్రియల్‌ ట్రెయినీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం సిద్ధమైంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. మొత్తం 56 ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. […]

Written By: Kusuma Aggunna, Updated On : October 24, 2021 7:01 pm
Follow us on

నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎల్‌సీ) నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన ఈ సంస్థ ఇండస్ట్రియల్‌ ట్రెయినీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం సిద్ధమైంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. మొత్తం 56 ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వేర్వేరు ప్రదేశాలలో ఈ ఉద్యోగ ఖాళీలు ఉండగా ఎంపికైన వాళ్లు ఆయా ప్రదేశాలలో పని చేయాల్సి ఉంటుంది. సీఎంఏలో లేదా సీఏలో ఇంటర్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు నెలకు 22,000 రూపాయల వేతనం లభించనుంది. అయితే ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో కేవలం సంవత్సరంపాటు పని చేయాల్సి ఉంటుంది. 2021 సంవత్సరం నవంబర్ 11వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

2021 సంవత్సరం నవంబర్ 22వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉందని తెలుస్తోంది. https://www.nlcindia.in/new_website/index.htm వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.