https://oktelugu.com/

Bigg Boss 5: రూ.75తో పారిపోయిన బిగ్ బాస్ బ్యూటీ లక్షలు సంపాదిస్తోంది ఇలా..

Bigg Boss 5: బిగ్ బాస్.. ఈ క్రేజీ షోలో ఒక్కసారి కనపడాలని తపించే వారు ఎంతో మంది ఉంటారు. అయితే చాలా తక్కువమందికి మాత్రమే బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం దక్కుతుంది. గత బిగ్ బాస్ సీజన్ లలో చాలా మంది సినీ సెలబ్రెటీలు పాల్గొన్నారు.కొంతమంది సామాన్యులకు అవకాశం కల్పించారు. ఇక అందరిలోకి ఒక ట్రాన్స్ జెండర్ ను పోయిన సారి చోటిచ్చారు. తాజాగా ఈ బిగ్ బాస్ 5 సీజన్ లోనూ మరో […]

Written By:
  • NARESH
  • , Updated On : October 24, 2021 / 07:00 PM IST
    Follow us on

    Bigg Boss 5: బిగ్ బాస్.. ఈ క్రేజీ షోలో ఒక్కసారి కనపడాలని తపించే వారు ఎంతో మంది ఉంటారు. అయితే చాలా తక్కువమందికి మాత్రమే బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం దక్కుతుంది. గత బిగ్ బాస్ సీజన్ లలో చాలా మంది సినీ సెలబ్రెటీలు పాల్గొన్నారు.కొంతమంది సామాన్యులకు అవకాశం కల్పించారు. ఇక అందరిలోకి ఒక ట్రాన్స్ జెండర్ ను పోయిన సారి చోటిచ్చారు. తాజాగా ఈ బిగ్ బాస్ 5 సీజన్ లోనూ మరో అందమైన ట్రాన్స్ జెండర్ ను హౌస్ లోకి తీసుకున్నారు.

    జబర్ధస్త్ లో లేడీ వేషాలు వేసే ప్రియాంక సింగ్ ను ట్రాన్స్ జెండర్ కోటాలో బిగ్ బాస్ 5లోకి తీసుకున్నారు. మగాడిగా ఉన్న సాయి అమ్మాయిగా మారి ఆపరేషన్ చేయించుకొని ట్రాన్స్ జెండర్ అయ్యాడు. ఈ సందర్భంగా బిగ్ బాస్ లో తను ఇలా మారడానికి గల కారణాలను వెల్లడించాడు.

    ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ తాజాగా బిగ్ బాస్ హౌస్ లో తన జీవితం సాగిన తీరు చాలా ఆవేదనతో చెప్పుకొచ్చింది. తాను ఐదో తరగతి చదువుతున్నప్పటి నుంచి తనలో అమ్మాయి లక్షణాలు మొదలయ్యాయని.. ఊళ్లో అందరూ పెరిగే క్రమంలో అమ్మాయిలా మాట్లాడుతున్నావ్.. చేస్తున్నావని నా మీద ఫిర్యాదు చేశారని.. నా ప్రవర్తనపై నాన్నకు ఫిర్యాదు చేసే వారని ప్రియాంక వాపోయింది.

    ఈ క్రమంలోనే పల్లెటూర్లో తనను అమ్మాయి అనడాన్ని భరించలేక నాన్న జేబులోంచి 50 రూపాయలు, ముడుపుకట్టిన రూ.25 తీసుకొని హైదరాబాద్ వచ్చేశానని ప్రియాంక వాపోయింది. హైదరాబాద్ వచ్చే సరికి నా దగ్గర రూ.2 మాత్రమే మిగిలాయని.. ఒక రూపాయి కాయిన్ తో మాదాపూర్ లోని మా అక్కకి ఫోన్ చేస్తే వాళ్లు వచ్చి తీసుకెళ్లారని.. అప్పుడు అనుకోకుండా ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చిందని తెలిపారు.

    ఆ తర్వాత జబర్ధస్త్ అప్పారావు చూసి లేడి గెటప్ వేస్తావా అని అడిగి వేయించాడని.. తనలో అమ్మాయి లక్షణాలు ఉండడంతో ఆ కోరిక తీర్చుకునేందుకు ఓకే చెప్పానని ప్రియాంక తెలిపింది. అలా కామెడీ షోలో మొదలైన కెరీర్ ఇప్పటిదాకా సాగిందని తెలిపారు. నా మొదటి సంపాదన రూ.300 అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నానని గుక్కపట్టి ఏడ్చేసింది ప్రియాంక.

    ఇప్పుడు తనను గేలి చేసిన గ్రామస్థులే బిగ్ బాస్ లో, జబర్ధస్త్ లో కనిపిస్తుంటే గర్వపడుతున్నారని తెలిపింది. ఇలా 75 రూపాయలతో దిక్కు దివానం లేకుండా హైదరాబాద్ వచ్చిన ప్రియాంక ఇప్పుడు కోట్లాది మంది హృదయాలను కొల్లగొడుతూ బిగ్ బాస్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని ముందుకు సాగుతోంది. ఆమెకు మనం ఆల్ ది బెస్ట్ చెబుదాం.