
ఇండియన్ నేవీ నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ నేవీ ఈ నోటిఫికేషన్ ద్వారా సెయిలర్ పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధమవుతోంది. సీనియర్ సెకండరీ రిక్రూట్ (ఎస్ఎస్ఆర్), ఆర్టిఫిసర్ అప్రెంటిస్ (ఏఏ) ఉద్యోగ ఖాళీలను ఇండియన్ నేవీ భర్తీ చేయనుంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వారికి ట్రైనింగ్ సమయంలో 14,600 రూపాయల స్టైఫండ్ లభిస్తుంది.
మొత్తం 2700 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కాగా పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి అర్హులు. త్వరలోనే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది . ఈ నెల 26వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండటం గమనార్హం. 60 మార్కులతో ఇంటర్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నిర్ణీత ప్రమాణాల ప్రకారం శరీరధారుడ్యం కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 100 మార్కులకు హిందీ, ఇంగ్లిష్‌లో రాతపరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ఈ ఉద్యోగాలకు 215 రూపాయలు దరఖాస్తు ఫీజు కాగా ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి ఫీజు లేదు.
2021 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు