
‘గబ్బర్ సింగ్’తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు పవన్-హరీష్ శంకర్. అసలుసిసలు మాస్ మాసాలాను ఈ సినిమాతో చూపించాడు దర్శకుడు హరీష్ శంకర్. ఆ సినిమా కాంబో మరోసారి రిపీట్ అవుతోంది. పవన్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో ‘గబ్బర్ సింగ్’ తర్వాత ఇప్పుడు మరో మూవీ రాబోతోంది. తాజాగా పవన్ కోసం హరీశ్ శంకర్ కొత్త కథతో సినిమాను రూపుదిద్దుతున్నాడట. అది ఒక భారీ ప్రయోగం అని ఫ్యాన్స్ కు పూనకాలు తప్పవని అంటున్నారు.
ప్రస్తుతం పవన్ రెండు సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత హరీష్ తో చేయనున్నాడు. పవన్ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు హరీష్ శంకర్ రెడీ చేసుకుంటున్నాడట. మిగతా సినిమాలు పూర్తి కాగానే పవన్ తో సినిమా తీసేందుకు హరీశ్ శంకర్ సిద్ధంగా ఉన్నాడట. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కథపై ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కొందరు హరీశ్ శంకర్ తీయబోయే సినిమా కథ ఇదీ అని ప్రచారం జరడంతో ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది.
హరీష్ తీయబోయే కొత్త చిత్రంలో పవన్ కల్యాణ్ సీబీఐ అధికారిగా నటించనున్నాడు. ఇందులో డబుల్ రోల్లో నటించనున్నాడు. ఇప్పటివరకు పవన్ కల్యాణ్ తీన్మాన్ సినిమాలో డ్యూయల్ రోల్ చేశారు. అయితే అందులో ఒకేసారి రెండు పాత్రలు కనిపించలేదు. కానీ త్వరలో రాబోయే సినిమాలో మాత్రం పవన్ ఒకేసారి రెండు పాత్రల్లో కనిపిస్తాడు. ఈ రెండిట్లో ఒకరు తండ్రిలాగా.. మరొకరు కొడుకులాగా నటిస్తారట. మొదటి సారి పవన్ ను ఇలా నటిస్తున్నాడని వార్తలు రావడంతో పవన్ కల్యాణ్ అభిమానుల్లో మరోసారి జోష్ పెరిగింది.
పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ తో బిజీగా మారాడు పవన్. ఆ తరువాత మరో సినిమా చేయనున్నాడు. అనంతరం హరీష్ శంకర్ సినిమా ఉండనుంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ రీఎంట్రీ సినిమా అదిరిపోయింది. మూడేళ్ల తరువాత ‘వకీల్ సాబ్’తో వచ్చి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. ఆ తరువాత మరో సినిమాలకు కూడా సైన్ చేసి వాటిని మొదలు పెట్టాడు. మూడేళ్ల సుదీర్ఘ విరామం తీసుకున్న ఆయనను ‘వకీల్ సాబ్’తో చూసేసరికి ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అంతేకాకుండా ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పవన్ సినిమాలు ఇక ఫుల్ జోష్ ను పెంచుతాయని అంటున్నారు.