https://oktelugu.com/

Jobs: పదో తరగతి అర్హతతో నావీలో 1531 ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

Jobs:  ఇండియన్ నేవీ నిరుద్యోగులకు తాజాగా మరో తీపికబురు అందించింది. 1531 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అనుభవం ఉన్న ఉద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతోంది. https://www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. 2022 సంవత్సరం మార్చి 31 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 5, 2022 / 09:23 AM IST
    Follow us on

    Jobs:  ఇండియన్ నేవీ నిరుద్యోగులకు తాజాగా మరో తీపికబురు అందించింది. 1531 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అనుభవం ఉన్న ఉద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతోంది. https://www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. 2022 సంవత్సరం మార్చి 31 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.

    ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 19,900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. నేవీ, ఎయిర్ ఫోర్స్ లో రెండు సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ లేదా తత్సమాన అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

    పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు. అర్హత ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుందని చెప్పవచ్చు. పదో తరగతి అర్హత కావడంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువని చెప్పవచ్చు.

    భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు సంబంధించిన ఈ సంస్థ నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.