Indian Navy AA SSR Recruitment: ఇండియన్ నేవీ నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. 2500 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. సీనియర్ సెకండరీ రిక్రూట్స్ ఉద్యోగ ఖాళీలతో పాటు ఆర్టిఫిషర్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. ఇంటర్ లో ఎంపీసీ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావడంతో ఈ ఉద్యోగాలకు ఎంపికైతే భవిష్యత్తు బాగుంటుందని చెప్పవచ్చు.

అయితే పెళ్లి కాని పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్టిఫిషర్ అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు ఇంటర్ లో కనీసం 60 శాతం మార్కులను సాధించాల్సి ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్ తో పాటు కంప్యూటర్ సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. ఫిబ్రవరి 1 2002 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం జనవరి 31వ తేదీలోపు జన్మించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
సీనియర్ సెకండరీ రిక్రూట్స్ ఉద్యోగ ఖాళీల కొరకు ఇంటర్ అర్హతతో మ్యాథ్స్, ఫిజిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ చదివిన వాళ్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 16వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 25వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
https://www.joinindiannavy.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మెడికల్ ఎగ్జామ్, ఫిట్ నెస్ ఎగ్జామ్, ఆన్ లైన్ ఎగ్జామ్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.