https://oktelugu.com/

పది పాసైన వాళ్లకు శుభవార్త.. ఇండియ‌న్‌ కోస్టు గార్డులో ఉద్యోగాలు..?

గత కొన్ని రోజుల నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా వరుస నోటిఫికేషన్లు వెలువడుతుండగా తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఇండియ‌న్ కోస్టు గార్డు.. నావిక్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి పాస్ అయిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కుక్, స్టీవార్డ్ ఉద్యోగాలకు ఖాళీలు ఉండగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://joinindiancoastguard.gov.in/ వెబ్ సైట్ లో ఈ ఉద్యోగాలకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 15, 2020 / 06:13 PM IST
    Follow us on


    గత కొన్ని రోజుల నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా వరుస నోటిఫికేషన్లు వెలువడుతుండగా తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఇండియ‌న్ కోస్టు గార్డు.. నావిక్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి పాస్ అయిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కుక్, స్టీవార్డ్ ఉద్యోగాలకు ఖాళీలు ఉండగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    https://joinindiancoastguard.gov.in/ వెబ్ సైట్ లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. మొత్తం 50 ఖాళీలు ఉండగా ఎంపికైన వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభిస్తుంది. ఈ ఉద్యోగాలకు పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2021 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నాటికి 18 – 22 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    ఈ ఉద్యోగాల కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌, మెడిక‌ల్ టెస్ట్‌ లు నిర్వహిస్తారు. ఈ ఉద్యోగాల కోసం ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 30వ తేదీన ప్రారంభం కానుండగా డిసెంబర్ 7 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

    దరఖాస్తు చేస్తుకున్న అభ్యర్థులకు డిసెంబర్ నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో ఈ అడ్మిట్ కార్డులను పొందవచ్చు. పదో తరగతి మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హత కావడంతో ఈ ఉద్యోగాలకు పోటీ తీవ్రంగా ఉండనుంది.