
ఇండియన్ ఆర్మీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ మధ్య కాలంలో వరుస నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న ఇండియన్ ఆర్మీ తాజాగా యువతుల కోసం ప్రత్యేక నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. 100 ఆర్మీ జనరల్ డ్యూటీ ఉద్యోగ ఖాళీల కోసం నోటిఫికేషన్ రిలీజ్ కాగా పది పాసైన యువతులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. పదో తరగతి ఉత్తీర్ణులైన 21 ఏళ్ల లోపు యువతులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
యువతుల కొరకు ప్రత్యేకంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి గల మహిళా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ http://www.joinindianarmy.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 6వ తేదీ నుంచి జులై 20వ తేదీ మధ్య పది పాసైన యువతులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అంబాలా, లక్నో, బబల్‌పూర్, బెల్గాం, పూణే మరియు షిల్లాంగ్ వద్ద ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుందని సమాచారం. ఎవరైతే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటారో వారికి ఈ మెయిల్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు అందుతాయి. కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్, ఫిజికల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. మహిళా నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.